Monday, December 23, 2024

నాకు ఫలానా కావాలని ఏదీ అడగలేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమంత్రిగా ప్రధాని మోడీ నాకు బాధ్యతలు ఇచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. నాకు ఫలానా కావాలని పార్టీని ఎప్పూడు ఏదీ అడగలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. పార్టీ గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను నిర్వర్తించానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తామన్నారు.

ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్ కు రానున్నారు. ప్రధాని సభకు ఏర్పాట్లు చేయాల్సిఉందన్న కిషన్ రెడ్డి, వరంగల్ లో ప్రధాని రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు భూమిపూజ చేస్తారని వెల్లడించారు. 150 ఎకరాల విస్తీర్ణంలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ నిర్మాణం జరగనుందన్నారు. రోజుకు 3 వ్యాగన్లు తయారు చేసే యూనిట్ ను వరంగల్ లో ఏర్పాటు చేయనున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ లో ఆర్ఎంయూ ద్వారా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News