Monday, January 20, 2025

2 గంటల్లో సిబిఐ ఇక్కడికి వస్తుంది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్ పై యువత కోపంగా ఉన్నారని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమాజీగూడలోని మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతారని ఆయన జోస్యం చేప్పారు. తెలంగాణ ఎన్నికల కోసం కార్నాటకలో కాంగ్రెస్ పన్ను వసూలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అమలు చేయలేని హామీలను కాంగ్రెస్ ఇస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

మేడిగడ్డ బ్యారేజీని చూస్తే కడుపు తరుక్కుపోతుందని, రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన తీసుకోచ్చారని మండిపడ్డారు. ఎన్నికలను కెసిఆర్ డబ్బుమయం చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కట్టన్నారు. సోనియా, రాహుల్ ను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ తో.. బిజెపికి సంబంధం ఉన్నట్లా? అని ఆయన పశ్నించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు కెసిఆర్ అనుమతిస్తే.. 2 గంటల్లో సిబిఐ ఇక్కడికి వస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News