Sunday, December 22, 2024

జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఆదివారం శ్రీనగర్‌లో విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. అయితే కశ్మీర్ వ్యాలీలో 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగే అవకాశం ఉందని, వారితో సంప్రదింపులు జరిపి పార్టీ గెలుపునకు బాటలు వేస్తామన్నారు. మొత్తం అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని, త్వరలో తొలివిడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు.

పార్టీలో పీడీపీ మాజీ నేత , మాజీ మంత్రి చౌదరి జుల్ఫీకార్ అలీ తమ పార్టీలో చేరడంతో బీజేపీకి అదనపు బలం వచ్చినట్టయిందన్నారు. ఆర్టికల్ 370పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను రవీందర్ రైనా ఖండించారు. జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయిందని, అందుకే ఆ పార్టీ నేత ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News