Wednesday, January 22, 2025

“న్యూస్‌క్లిక్‌” పై నాడు ఈడీ చర్యను తప్పుపట్టిన విపక్షాలు : బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి న్యూస్‌క్లిక్ మీడియా పోర్టల్‌కు నిధులు అందుతున్నాయని అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్ పత్రికలో ఆరోపణలు వచ్చాయని , 2021లో న్యూస్‌క్లిక్‌పై ఈడీ చర్యను విపక్షాలు తప్పు పట్టాయని ఉదహరిస్తూ బీజేపీ ధ్వజమెత్తింది. దేశ భద్రత, ఐక్యతను దెబ్బతీయాలన్న లక్షంతో చైనా ప్రేరేపణతో విపక్షాలన్నీ కొత్త పొత్తు కుదుర్చుకున్నాయేమోనని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఎంపి సుధాన్షుత్రివేది ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ న్యూయార్క్ టైమ్ వార్తాకథనాన్ని ఉదహరిస్తూ ఇండియా కూటమిని విమర్శించారు. న్యూస్ క్లిక్‌కు వ్యతిరేకంగా ఈడీ చర్యపై ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పు పట్టాయని ఆరోపించారు.

“అహంభావ ” నేతల కూటమి గురించి అమెరికా పత్రిక వెల్లడించిందని ఆరోపించారు. వామపక్షాలు కేవలం రష్యా, చైనా దేశాల ఆదేశాలే పాటిస్తుంటాయని అనుకునే వాళ్ల మని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ యువనేత కూడా చైనా మార్గదర్శకత్వంలో నడుస్తున్నారని అనుకోవలసి వస్తోందని గోయల్ ఆరోపించారు. ఆ పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో చైనాతో భారత్ వాణిజ్యం అభివృద్ధి చెందిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, పత్రికాస్వాతంత్య్రం గురించి పదేపదే మాట్లాడే వారిని న్యూస్‌క్లిక్ గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పాత్రికేయుల సమావేశంలో గోయల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News