Friday, December 20, 2024

పశ్చిమ బెంగాల్‌లో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో కాల్పుల కలకలం రేపాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాట్పారాలో తన కారుపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపారని బీజేపీ నేత ప్రియాంగు ఆరోపించారు. హత్యాయత్నంలో భాగంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆయన ఆరోపణలు చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి గాయాలు గాయాలయినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలంలో ఓ ఖాళీ బాంబు షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News