Friday, November 22, 2024

యుపి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బిజెపి విజయభేరీ

- Advertisement -
- Advertisement -

BJP Clinches Victory in UP Zila Panchayat Polls

75 స్థానాలలో 65 కాషాయం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార బిజెపి భారీ విజయం దిశలో సాగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో స్థానిక ఫలితాలు కీలకంగా మారాయి. ప్రస్తుత పరిస్థితి సమాజ్‌వాది పార్టీకి గడ్డుగా మారింది. మొత్తం 75 జిల్లా పంచాయత్ అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరగగా వీటిలో బిజెపి 60కి పైగా స్థానాలను గెల్చుకోనుంది. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల పరిషత్‌లకు అధ్యక్ష ఎన్నికలు శనివారం జరిగాయి. అఖిలేష్ యాదవ్ సారథ్యపు ఎస్‌పి కేవలం ఆరు స్థానాలకు పరిమితం కానుంది. 2016లో ఈ స్థానాలకు జరిగిన ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీ 60 స్థానాలు దక్కించుకుంది. స్థానిక బలం చాటుకుంది. ఇప్పుడు ఈ కథ మారింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాల నాడిని బట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల బలాబలాలను బేరీజు వేసేందుకు వీల్లేదని, స్థానిక అంశాలు అనేకం ఉంటాయని, వీటితో అసెంబ్లీ ఎన్నికల్లో బలాలను అంచనా వేయడం కుదరదని కొన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.

అధికార బలంతో విజయం : అఖిలేష్

స్థానిక సంస్థల ఎన్నికలనూ బిజెపి అపహాస్యం చేసిందని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. అధికార బలాన్ని వినియోగించుకుని , ఓటర్లను బెదిరించి , పోలింగ్ శాతాన్ని తగ్గించి గెలిచిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని గేలిచేసినట్లే అని మండిపడ్డారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో బిజెపి ఈసారి జడ్‌పి ఎన్నికలను గందరగోళ పర్చింది. పరాజయాన్ని జయంగా మల్చుకునేందుకు పక్కదారి పట్టిందని అన్నారు. ఓటర్లను కూడా కిడ్నాప్ చేశారు. వారిని పోలీసులతో బెదిరించారు. పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా చేశారని ఆరోపించారు. మరో విచిత్రం ఏమిటంటే జిల్లా పంచాయతీ సభ్యుల ఎన్నికలలో అత్యధికం ఎస్‌పి వారు గెలిచారని , మరి జడ్‌పి అధ్యక్ష ఎన్నికలలో బిజెపి వారు ఎలా నెగ్గుతారని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News