Friday, December 27, 2024

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : లోక్ సభ సభ్యురాలు భారతీ బెన్ ధీమా

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, లోక్ సభ సభ్యురాలు భారతీ బెన్ అన్నారు. మేర భూత్ మజ్ భూత్ నినాధంతో ప్రతి భూస్థాయి కార్యకర్త ఎన్నకల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆమె కోరారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ‘ మేర భూత్ మజ్ భూత్’ పేరిట చేసిన ప్రసంగాన్ని మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్,జిహెచ్‌ఎంసి బీజేపీ పార్టీ విఫ్ తోకల శ్రీనివాస్‌రెడ్డి తన కార్యాలయంలో భారీ ఎల్‌ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడంతో ఆమె నాయకులు, కార్యకర్తలతో కలసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కమల వికసిస్తుందని,అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యోనుముకులు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంతో దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఎదిగిందని, రానున్న రోజుల్లో ఇక్కడ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ ఒన్‌గా అభివృద్ధి చెందనుందని ఆశాఢభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ పి. మల్లేష్ యాదవ్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు అడికె జనార్ధన్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, జోగి రవి, బుచ్చిరెడ్డి, ఎన్ను శ్రీనివాస్‌రెడ్డి, సురేష్ ముదిరాజ్, టి. చిన్న, శ్రీకాంత్‌రెడ్డి, పాండు యాదవ్, వి. లక్ష్మీ, శరణమ్మ, మజార్, రఘునాథ్, రమేష్‌రెడ్డి, ఎన్. జగన్, కె. బాబు, ప్రభుదాస్, నర్సిరెడ్డి, బి. రామక్రిష్ణ, రాములు, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News