Sunday, January 19, 2025

సద్దాం హుస్సేన్, కిమ్‌కు తీసిపోని కేజ్రీవాల్: బిజెపి

- Advertisement -
- Advertisement -

రాజౌరి: విలాసవంతమైన జీవితం, రాజభవనాలలో నివాసం విషయంలో ఇరాకీ మాజీ నియంత సంద్దాం హుస్సేన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఏమాత్రం తీసిపోరని బిజెపి శుక్రవారం విమర్శించింది. బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ గతంలో మాట్లాడిన మాటల వీడియోలను ప్రదర్శించారు. తన భారీ నివాస భవనాలు, లగ్జరీ కార్ల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న రాజకీయ నాయకులపై కేజ్రీవాల్ గతంలో కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.

Read Also: ఉగ్ర పేలుడులో ఇద్దరు సైనిక జవాన్ల మృతి… నలుగురికి గాయాలు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తన అధికారి నివాసంలో 10 ఎసిలు అమర్చుకున్న విషయాన్ని విమర్శిస్తూ కేజ్రీవాల్ 2013లో చేసిన ట్వీట్‌ను త్రివేది ఉదహరించారు. ఆప్ నాయకులు దేశంలో రాజకీయ నాయకుల విశ్వసనీయతను సంక్షోభంలో పడేశారని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ వంటి నాయకుల వల్ల ప్రజలలో రాజకీయ నాయకులంటేనే అపనమ్మకం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. కేజ్రీవాల్ నివసం మరమ్మతుల కోసం ఢిల్లీ ప్రభుత్వ రూ. 45 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. ఒక్కో బడ్జెట్ అంచనా తక్కువగా చూపించడానికి ఖర్చులను డివిడివిగా అనేక బడ్జెట్‌లలో చూపించారని, ఆడిట్ నుంచి తప్పించుకోవడానికే ఈ పని చేశారని త్రివేది ఆరోపించారు.

Read Also: నేడు నగరంలో చంద్రమాలిన్య గ్రహణం కనిపించనుందా?

దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. కాని రాజకీయ, నైతిక ప్రశ్నలకు కేజ్రీవాల్ జవాబు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఇంటి డోర్లకు సెన్సార్లు ఉంటాయని అంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తున్న కేజ్రీవాల్ అన్నిటిని రిమోట్ కంట్రోల్ ద్వారానే నడుపుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని, ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ విషయం నమ్మకద్రోహానికి గురయ్యారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News