- Advertisement -
దళపతి విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) జెండాపై బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పి) ఇసికి ఫిర్యాదు చేసింది. విజయ్ పార్టీ జెండాపై ఏనుగు గుర్తు తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని.. పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా, రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొలిటికల్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్టీ జెండాను అధినేత విజయ్ ఆవిష్కరించారు. జెండాలో రెండు ఏనుగుల మధ్య పువ్వు సింబల్ తో జెండాను రూపొందించారు. జెండాపై ఏనుగు గుర్తును తొలగించాలని బిఎస్పి డిమాండ్ చేస్తోంది. ఇక, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు.
- Advertisement -