Sunday, January 19, 2025

రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యపై ఇసికి బిజెపి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యపైన, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ (ఇవిఎం)లపై ఆయన వ్యాఖ్యలపైన ఎన్నికల కమిషన్‌కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం ఫిర్యాదు దాఖలు చేసింది. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 17న ముంబయిలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ‘హిందూయిజంలో ‘శక్తి’ అనే ఒక పదం ఉంది. ఒక శక్తికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం’ అని చెప్పారు.

‘ఆ శక్తి ఏమిటనేదే ప్రశ్న. రాజు ఆత్మ ఇవిఎంలో ఉంది. అది నిజం. రాజు ఆత్మ ఇవిఎంలో, దేశంలోని ప్రతి సంస్థలో, ఇడి, సిబిఐ, ఆదాయం పన్ను (ఐటి) శాఖలో ఉంది’ అని కూడా ఆయన చెప్పారు. వోటింగ్ యంత్రాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలలో గెలవలేరు అని కూడా రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News