Monday, December 23, 2024

రాహుల్ గాంధీని రాజకీయంగా దెబ్బతీయాలని బిజెపి కుట్ర : మానిక్ రావ్ ఠాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాహుల్ గాంధిని రాజకీయంగా దెబ్బ తీయాలని బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఎఐసిసి ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అన్నారు. కాని సుప్రీంకోర్ట్‌లో న్యాయం జరిగిందని ఆయనన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామన్నారు. గాంధీభవన్ ప్రకాశం హాలులో ఆదివారం జరిగిన ఓటర్ల జాబితా అవగాహన సదస్సులో ఠాక్రే మాట్లాడారు. టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ప్రజల కోసం, దేశ ఐక్యత కోసం పని చేస్తున్న రాహుల్ గాంధీ 2024 లో ప్రధాని అయ్యి దేశానికి సేవ చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్ కలసి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఏమి చేయలేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా రాష్ట్రంలో అప్పుల చేశారని ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఇక్కడ ఉందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిందని మానిక్‌రావు ఠాక్రే తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం చాలా కీలకంగా భావించాలని, బిఎల్‌ఎ లకు ఎన్నికల కమిషన్ ను అడిగే హక్కు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అధికార పార్టీ చేసే అక్రమాలను నివరించాలని ఉద్బోధించారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక్క నాయకుడు చాలా ముఖ్యం గా భావించాలన్నారు. ఎన్నికల సమయంలో బిఎల్ ఎ బాధ్యత చాలా ముఖ్యమైందని, దీనిని చాలా సీరియస్ గా తీసుకొని పని చేయాలని సూచించారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమాలు చాలా కీలకమైనవని, ఓటర్ల నమోదు, చేరికలు, తొలగింపులు ఎన్నికలలో చాలా ప్రభావం చూపుతాయన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లో 2 వేలు అంతకంటే తక్కువ ఓట్లతో ఓడిపోయామన్నారు. రేపటి ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో ఏదైనా అవకతవకలు జరిగితే ఆడిగేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ ల నియామకం చాలా ముఖ్యమన్నారు. సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా కు ఎలాంటి సందేహాలు, అనుమానాలు ఉన్నా పశ్నించడానికి బూత్ లేవెల్ ఏజెంట్ల బాధ్యత చాలా ముఖ్యమని అన్నారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సిద్ధం చేసినపుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు తీసుకుంటారని, పారదర్శకంగా ఓటర్ల జాబితా సిద్ధం చేయడంలో కమిషన్ విఫలం అయ్యిందన్నారు. తప్పులు ఉంటే వెంటనే ప్రశ్నించాలని అందుకు బిఎల్ ఏ లు ఉండాలన్నారు. 34 వేల పైచిలుకు బూతులున్నాయని, డిసిసి లకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించేందుకు అధికారాలు ఇస్తూ టిపిసిసి అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పిసిసి ఆఫీస్ బేరర్లు, డిసిసి అధ్యక్షులు ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా విషయంలో పకడ్బందీగా పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, మాజీ పిసిసి అధ్యక్షులు వి. హనుమంతరావు ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షులు, టిపిసిసికార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News