Friday, November 22, 2024

పోటీ పరీక్షలను ఆపేందుకు బిజెపి కుట్ర..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలను ఆపేందుకు బిజెపితో పాటు బి టీం పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలకు నిరుద్యోగులు పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించడం ఇష్టం లేదని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. పోటీ పరీక్షలు జరిగితే యువత బిఆర్‌ఎస్ వైపు వెళతారని విపక్షాలకు భయం పట్టుకుందన్నారు.

ఈ క్రమంలోనే జూన్ 11వ తేదీన నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని పిటీషన్లు దాఖలు అయ్యాయని, కానీ వాటిని కోర్టు కొట్టేసిందని రాజీవ్ సాగర్ గుర్తు చేశారు. హైకోర్టు సైతం పరీక్షలు నిర్వహించడానికి ఒప్పుకుందన్నారు. పరీక్షలు నిర్వహించాలన్నా హైకోర్టు వ్యాఖ్యలు విపక్షాలకు చెంపపెట్టని ఆయన తెలిపారు. టిఎస్పీఎస్సీ కేసును సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని కావాలనే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News