Tuesday, November 5, 2024

ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బిజెపి కుట్ర : రౌత్

- Advertisement -
- Advertisement -

Sanjay Raut

ముంబయి: ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బిజెపి  కుట్ర పన్నిందని, ఆ మేరకు హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)కి ప్రజెంటేషన్ ఇచ్చారని శివసేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం ఆరోపించారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన  బిజెపి మాజీ ఎంపి కిరీట్ సోమయ్య, బిజెపి పార్టీ నాయకులు, బిల్డర్లు, వ్యాపారవేత్తల బృందం ఈ కుట్రలో భాగమని ఆరోపించారు.

‘‘ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం గురించి హోం మంత్రిత్వ శాఖకి ఈ బృందం ప్రెజెంటేషన్ అందించింది. ఇందుకోసం సమావేశాలు నిర్వహించి నిధులు సేకరిస్తున్నారు. గత రెండు నెలలుగా ఇదే జరుగుతోంది, పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. నేను చెప్పేది నిరూపించడానికి నా దగ్గర రుజువు ఉంది. ఈ పరిణామం ముఖ్యమంత్రి (ఉద్ధవ్ థాకరే)కి కూడా తెలుసు” అని రౌత్ అన్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠీల శాతం బాగా తగ్గిపోయిందని, అందుకే కేంద్ర ప్రభుత్వ పాలనలో నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతూ సోమయ్య నేతృత్వంలోని బృందం మరికొద్ది నెలల్లో కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ఈ శివసేన పార్లమెంటు సభ్యుడు పేర్కొన్నారు. పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా సోమయ్య గతంలో సవాలు చేశారని రౌత్ గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News