Thursday, January 23, 2025

పంజాబ్‌లో సీట్ల పంపకం ఖరారు : 65 స్థానాల్లో బిజెపి పోటీ

- Advertisement -
- Advertisement -

BJP contest in 65 seats of Punjab
న్యూఢిల్లీ : పంజాబ్‌లో తమ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరిందని భారతీయ జనతా పార్టీ సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా 65 సీట్లలో బిజెపి పోటీ చేస్తుందని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) 37 స్థానాల్లో పోటీ చేస్తుందని, సాద్ (సంయుక్త్)కు 15 సీట్లు కేటాయించామని చెప్పారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 20 న ఒకే విడతలో పోలింగ్ జరగనున్నది. మార్చి 10 న ఫలితాలు విడుదల అవుతాయి. పంజాబ్‌లో ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమిగా బరిలో దిగేవి. అయితే గతంలో కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలు ఆ రెండు పార్టీల తెగతెంపులకు కారణమయ్యాయి. అదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిధ్ధూతో వివాదం కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవిని,పార్టీని వదిలేసి సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. శిరోమణి దూరం కావడంతో ఒంటరైన బిజెపి ఇప్పుడు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. పంజాబ్‌లో మరో చిన్న పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ వీరితో జతకలిపింది. ఇవాళ ఈ కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. కూటమిలో సీట్ల సర్దుబాటు కోసం బిజెపి జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాతో రెండు పార్టీల అధ్యక్షులు భేటీ అయ్యారు. ముగ్గురు అన్ని అంశాలపై చర్చించి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News