Wednesday, January 22, 2025

బిజెపి ‘ఆపరేషన్ లోటస్’ కొనసాగిస్తోంది: సిసోడియా

- Advertisement -
- Advertisement -

 

Sisodia

న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు చైర్మన్ అమానతుల్లా ఖాన్ అరెస్టుపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం స్పందిస్తూ, ఆప్ నేతలను “విచ్ఛిన్నం” చేయడానికి బిజెపి తన “ఆపరేషన్ లోటస్”ను కొనసాగిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు సంబంధించి ఓఖ్లాకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఖాన్‌ను అవినీతి నిరోధక శాఖ శుక్రవారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

‘‘మొదట సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేశారు,  కానీ కోర్టులో అతడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు.. నా నివాసంపై దాడి చేశారు.. ఏమీ దొరకలేదు.. తర్వాత కైలాష్‌ గహ్లాట్‌పై నకిలీ విచారణ జరిపి.. ఇప్పుడు అమానతుల్లాఖాన్‌ను అరెస్టు చేశారు.. ‘ఆపరేషన్ లోటస్’ ఆప్‌కి చెందిన  ఒక్కో నాయకుడిని ఛేదిస్తూనే ఉంది” అని సిసోడియా హిందీ  ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇచ్చి ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి  ప్రయత్నిస్తోందని గతంలో ఆప్ నేతలు ఆరోపించారు. ఇదిలావుండగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఎమ్మెల్యేలందరూ తనతో ఉన్నారని నిరూపించడానికి గత నెలలో అసెంబ్లీలో విశ్వాస తీర్మానం కూడా తీసుకువచ్చారు, ఢిల్లీలో “ఆపరేషన్ లోటస్” విఫలమైందని నొక్కి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News