Tuesday, January 14, 2025

బిజెపి కార్పొరేటర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ కు సంబంధించిన ఓ పాత వీడియోను గత వారం పెట్టినందుకు హైదరాబాద్ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ ఊరపల్లి, ఇతరులను అరెస్టు చేసింది. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో బహదూర్ పురా లో  అనేక అవకతవకలు జరిగాయంటూ ఓ వీడియో క్లిప్ ను సర్క్యూలేట్ చేశారు.

శ్రవణ్ ఊరపల్లి హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కార్పొరేటర్. ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదు దాఖలు చేసిన మరునాటి నుంచి అతడు తప్పించుకున్నాడు. ఇదిలావుండగా తెలంగాణలో ఎన్నికలు సక్రమంగానే జరిగాయని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.  హైదరాబాద్ నుంచి ఎంపీ సీటుకు పోటీచేస్తున్న బిజెపి అభ్యర్థి మాధవీ లత విస్తృతంగా తిరుగుతూ బుర్ఖాలో ఉన్న ముస్లిం మహిళలను, వారి ఫోటో ఐడెంటిలతో చెక్ చేయడంతో పాటు రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు.

శ్రవణ్ ఊరపల్లి ఎక్స్ లో పెట్టిన వీడియో క్లిప్పింగ్ పై, కార్పొరేట్ అరెస్టు పై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా ఆ వీడియో తెలంగాణకు సంబంధించింది కాదని సిఈవో తెలిపారు. ఆ వీడియో క్లిప్పింగ్ ను ఇదివరలో టివి9 బంగ్లా యూట్యూబ్ లో 2022 ఫిబ్రవరి 27 పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News