Friday, September 20, 2024

బిజెపి అతి

- Advertisement -
- Advertisement -

BJP corporators created havoc in GHMC office in name of protest

జిహెచ్‌ఎంసి కార్యాలయంలో అరాచకం, విధ్వంసం

పూలకుండీలు, అద్దాలు
ధ్వంసం పోలీసులతో
తోపులాట బిజెపి
కార్పొరేటర్లు, కార్యకర్తలపై
కేసు ప్రజాప్రతినిధులే ఆస్తిని
ధ్వంసం చేయడమా? :
మేయర్ విజయలక్ష్మి

మన తెలంగాణ/హైదరాబాద్ : నిరసన పేరుతో బిజెపి కార్పొరేటర్లు జిహెచ్‌ఎంసి కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. మంగళవారం బల్దియా కార్యాలయం నినాదాలు, అరెస్టులతో దద్దరిల్లిపోయింది. కొద్దిసేపు అక్కడ ఏమి జరగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే జిహెచ్‌ఎంసి పాలక మండలి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి కార్పొరేటర్లతో పాటు పార్టీ శ్రేణులు జిహెచ్‌ఎంసి మేయర్ చాంబర్ ముందు మెరుపు ధర్నా నిర్వహించారు. నిరసనకు దిగిన బిజెపి శ్రేణులు మేయర్ చాంబర్‌లోకి దూసుకు వెళ్లారు. ఈక్రమంలో కార్పోరేటర్లు వారి అనుచరలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్పొరేటర్ల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మేయర్ చాంబర్ ముందున్న పూల కుండీలను బద్దలు కొట్టారు. అదేవిధంగా అధ్దాలను సైతం ధ్వంసం చేశారు. అంతేకాకుండా మేయర్ చాంబర్ ఎదురుగా జిహెచ్‌ఎంసి అని రాసి ఉన్న బోర్డుకు బ్లాక్ స్రే కొట్టడమే కాకుండా ప్రభుత్వంతో పాటు మేయర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పాలక మండలి ఏర్పడి 11 నెలలు దాటిన పేరుకు మాత్రం గత జూన్‌లోవర్చువల్ విధానంలో సర్వసభ సమావేశం నిర్వహించి మేయర్ చేతు లు దూలుపుకున్నారని బిజెపి కార్పొరేటర్లు అగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయినా చర్చించి వాటిని పరిస్కరించే అవకాశం లేకుండా పోయిందన్నారు. వర్చువల్ ఆ సమావేశం నిర్వహించి కూడా 6 నెలల దాటుతున్న మేయర్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం లేదన్నారు. సర్వసభ్య సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని ఇప్పటీకే పలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశామని, ఇటీవల వినతి పత్రం ఇచ్చేందుకు మేయర్‌కు అపాయిమెంట్ ఇచ్చినట్లే ఇచ్చి అందుబాటులోకి రాకుండ పోయ్యారన్నారు. ఇందుకు తాము జిహెచ్‌ఎంసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాల్సి వచ్చిందని కార్పొరేటర్లు పేర్కొన్నారు. తాము శాంతియూతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులు కావాలని తమను రెచ్చగొట్టడమే కాకుండా ఇష్టానుసారంగా ఈడ్చి పడేశారని, ఆ క్రమంలో పూల కుండీలు, అధ్దాలు ధ్వసంమై ఉండోచ్చని బిజెపి కార్పొరేటర్లు పేర్కొన్నారు. చాంబర్ కార్యాలయం ముందు నిరసనకు దిగినా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళా కార్పొరేటర్ల ఎక్కువ సం ఖ్యలో ఉండడంతో అధికారులు మహిళా పోలీసులను అధికారులు రప్పించారు. మేయర్ చాంబర్ మొదటి అం తస్తు మధ్యలో ఉండడంతో ఆందోళన కారులను అరెస్టు చేసేందుకు పోలీసులు ముప్పు తిప్పల పడ్డారు. పై నుంచి ఒక్కొక్కరిని మోసుకుంటూ వచ్చి వ్యాన్‌ల్లో వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. బిజెపి కార్పొరేటర్లు తోకల శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి,కొప్పుల నర్సింహారెడ్డి, శంకర్ యాదవ్, పద్మా, ఆకుల శ్రీవాణి, మహాలక్ష్మి, మహేందర్‌తో పాటు మొత్తం 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే క్రమంలో మంగళవారం బిజెపి కార్పొరేటర్లు, కార్యకర్తలు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోకి అక్రమంగా చోరబడి ఆస్తులను ధ్వసం చేయడం తో పాటు అల్లరులు సృష్టించారని జిహెచ్‌ఎంసి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలపై సైపాబాద్ పోలీసులు కేసు నమో దు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మేయ ర్ చాంబర్‌తో పాటు కార్యాలయంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరా పుటెజ్‌లను పరిశీలించారు.

ప్రజా ప్రతినిధులే ప్రజా ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం : మేయర్ విజయలక్ష్మి

ఆందోళన ముసుగులో ప్రజా ఆస్తులను ధ్వంసం చేయ డం హేయమైన చర్య అని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి మండిపడ్డారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ధర్నా పేరుతో బిజెపి సృష్టించిన అరాచకంపై మంగళవారం మేయర్ తన క్యాంప్ ఆఫీసులో మీడియా తో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజస్వామ్య పద్దతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ జిహెచ్‌ఎంసి ఆస్తులను ధ్వంసం చేయడమేమిటాని ఆమె ప్రశించారు. ప్రజా ప్రతినిధులే ప్రజల ఆస్తి నష్టపర్చడంపై బిజెపి కార్పొరేటర్ల ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి ఈ విధమైన దాడులకు ప్పాలడడం వల్ల ప్రజలకు వ్యవస్థల పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పొయేలా చేస్తుందన్నారు. తనను కలిసేందుకు అపాయిమెంట్ ఇచ్చినా బిజెపి కార్పొరేటర్లు రాలేదని, దీనిపై వెంటనే సమాధానం చెప్పాలన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ దాడులకు పాల్పడడం సరైంది కాదన్నారు. తాము సైతం ఎదురు తిరుగుతే బిజెపి ఎక్కడ ఉంటోందో ఆలోచించుకోవాలని హితువు పలికారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తాము ఎక్కడా రాజీ పడలేదని, పడబోమూ కూడా అని మేయర్ స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో లొతట్టు ప్రాంతాలను ఎప్పటీకప్పుడు సందర్శించి అధికారులను ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఎల్‌బినగర్ జోన్‌లోని సరూర్‌నగర్ ప్రాంతం ఎక్కువ ముంపుకు గురైన సందర్భంలో సంక్షేమ సంఘా లు, కార్పొరేటర్లు, అధికారులతో సమిక్ష సమావేశాలు నిర్వహించడమే కాకుండ తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రతి సందర్భం లో మేయర్ కార్యాలయం నిరంతరాయంగా పని చేస్తుం దని తెలిపారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో గత జూన్ 29వ తేదీన పర్చువల్ ద్వారా జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం నిర్వహించామని, ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలన్నింటిని పరిష్కారించామని మేయర్ వెల్లడించారు.

ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకి

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ కారణంగా జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం నిర్వహించలేకపోతున్నామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ విషయం బిజెపి కార్పొరేటర్లకు తెలిసినప్పటకీ రాజకీయ దురుద్దేశంతోనే కావాలని అల్లర్లకు పాల్పడ్డాని ఆమె మండి పడ్డారు. ప్రజా ఆస్తులు ధ్వంసం చేయడం సహించరాదని, ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లే ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేయర్ విజయలక్ష్మి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News