Wednesday, January 22, 2025

ఉప ఎన్నికల్లో పత్తా లేని బీజేపీ… పుంజుకున్న కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

BJP could not win single seat in by-elections

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు, ఒక లోక్‌సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మినహా మిగిలిన అన్ని చోట్ల బీజేపీ ద్వితాయ స్థానంలో ఉండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, బీహార్ లోని ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గాలతోపాటు పశ్చిమబెంగాల్ లోని ఒక అసెంబ్లీ నియోజక వర్గం, ఒక పార్లమెంట్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. బీహార్ లోని బొచహన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 ఓట్ల శాతంతో 82,547ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక ఛత్తీస్‌గఢ్ లోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఆ పార్టీ అభ్యర్థి యశోదా నీలాంబర్ వర్మ 53.55 ఓట్ల శాతంతో విజయం సాధించారు. మహారాష్ట్ర లోనూ కాంగ్రెస్ ఇదే జోరు సాగించింది. కొల్లాపూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్ ఏకంగా 53.93 ఓట్ల శాతం తో 83,088 ఓట్లు సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్సీపీ, శివసేన పోటీకి దూరంగా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ లో మమతాబెనర్జీ నేతృత్వం లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి టీఎంసీ కి వచ్చిన సింగర్ బాబూల్ సుప్రియో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో సీపీఎం అనూహ్యంగా రెండో స్థానం లోకి రావడం గమనార్హం. టీఎంసీ 49.22 శాతం, సీపీఎం 30.89 శాతం, ఓట్లు రాబట్టగా బీజేపీ కేవలం 12.31 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక అసన్‌సోల్ లోక్‌సభ నియోజక వర్గంలో టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా విజయం సాధించారు. గతంలో బీజేపీ నేత అయిన శత్రుఘ్న మొదట కాంగ్రెస్ లోకి, తరువాత కొద్దిరోజుల క్రితం టీఎంసీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News