Friday, January 10, 2025

కాంగ్రెస్‌పై బిజెపి ఎదురుదాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ శైవమఠం నుంచి అప్పట్లో ఈ చారిత్రక రాజదండం నెహ్రూకు అందిందని, తరువాత ఇది మాయం అయి చివరికి అలహాబాద్ మ్యూజియంలో ఓ ఊతకర్ర స్థితిలో ఉందని , దేశానికి ఇది అవమానకరం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా , బిజెపి ఇతర నేతలు విమర్శించారు. భారతీయ సంస్కృతి ఆచార వ్యవహారాలంటే పడని కాంగ్రెస్ అనుచితంగా వ్యవహరిస్తోందని అమిత్ షా చెప్పారు.

ప్రతిపక్ష పార్టీలు కొన్ని పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై బిజెపి అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా (జెపి నడ్డా) ఖండించారు. వారసత్వ రాజకీయాల కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగయుత ప్రజాస్వామ్యం, గణతంత్రం అంటే సహించదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలలో సహేతుకత లోపించిందని, వంశానుగత రాజకీయాల ప్రస్తావన లేకుండా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పట్ల దేశ ప్రజలు తమ నమ్మకం చాటిచెప్పడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News