- Advertisement -
న్యూఢిల్లీ : మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం “దూసుకుపోతున్న ఓటమిని అంగీకరించడమే”నని బీజేపీ బుధవారం వ్యాఖ్యానించింది. ఈమేరకు బీజేపీ ఐటి విభాగం అధినేత అమిత్ మాలవీయ తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి సోనియా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తరువాత అమిత్ మాలవీయ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమేథీ , రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పొందిన తరువాత గాంధీలు ఇప్పుడు తమ ప్రతి బలమైన స్థానాన్ని కోల్పోయారని అందుకే రాజ్యసభ మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ 11 స్థానాలను కేటాయించినా, అక్కడ కాంగ్రెస్ ఖాళీ అవడం ఖాయమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా ఇప్పుడు రాజ్యసభకు పోటీ చేయడం విశేషం.
- Advertisement -