Sunday, February 23, 2025

రాహుల్ టీషర్టు ఖరీదుపై బిజెపి విమర్శలు

- Advertisement -
- Advertisement -

BJP criticizes the cost of Rahul's T-shirt

అది ప్రజల సొమ్ము కాదంటూ కాంగ్రెస్ కౌంటర్

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధరపై బిజెపి విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ.41,000కు పైగా ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. భారత్, దేఖో(భారత్, చూడు) అంటూ బిజెపి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రెండు ఫోటోలను పోస్టు చేసింది. ఒక ఫోటోలో టీషర్టుతో రాహుల్, ఆయన ధరించిన టీషర్టును పోలిన బ్లూబెర్రీ టీషర్టు ధర రూ. 41,257 అంటూ మరో ఫోటోను బిజెపి పోస్టు చేసింది. అయితే, ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా ధీటుగా స్పందించారు. బిజెపి నుంచి వచ్చిన ఈ ట్వీటుతో ఆ పార్టీ రాహుల్ యాత్రతో ఎంత వణికిపోతోందో స్పష్టమవుతోందని కొందరు కౌంటర్ ఇవ్వగా రాహుల్ గాంధీ ఖర్చు పెట్టుకుంది ప్రజల సొమ్ము కాదని, తన సొంత సొమ్మని మరికొందరు జవాబిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News