Wednesday, January 22, 2025

బీజేపీ అప్పులు రూ. 100 లక్షల కోట్లు: హరీశ్

- Advertisement -
- Advertisement -

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 100 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర జీఎస్ డీపీలో తెలంగాణ అప్పులు 28 శాతమైతే, దేశ జీడీపీలో బీజేపీ అప్పులు 57 శాతంగా ఉన్నాయని ఆయన వివరించారు. అప్పులు ఎక్కువగా బీజేపీ చేస్తే, తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని నిర్మలా సీతారామన్ ఆరోపించడం సబబు కాదన్నారు. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ కిందనుంచి ఆరోస్థానంలో ఉందని హరీశ్ తెలిపారు. సిద్దిపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో 12 రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెట్టాయని, మరికొన్ని రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాన్ని హరీశ్ ప్రస్తావిస్తూ, మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెగేసి చెప్పింది ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే, రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తారని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News