Thursday, December 26, 2024

ఒడిషాలో బిజెడి బిజెపి చర్చలు విఫలం

- Advertisement -
- Advertisement -

ఒడిషాలో బిజెడి , బిజెపిల మధ్య సీట్ల సర్దుబాట్లు కుదరలేదు. తాము లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలన్నింటికి సొంతంగానే పోటీ చేస్తామని అధికారంలో ఉన్న బిజెడి ప్రకటించింది. గత కొద్దిరోజులుగా బిజెపి బిజెడిల మధ్య సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుగుతూ వచ్చాయి. తమ పార్టీ మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు , 21 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తుందని బిజెడి కార్యనిర్వాహక కార్యదర్శి ప్రణబ్ ప్రకాశ్ దాస్ ప్రకటించారు.

ఒడిషాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి మొత్తం నాలుగు విడతలుగా పోలింగ్ ప్రక్రియ ఖరారయింది. తమ పార్టీ ఇంతకు ముందటిలాగానే విజయం సాధిస్తుందని బిజెడి ధీమా వ్యక్తం చేసింది. జగన్నాథ స్వామి ఆశీస్సులు ఇక్కడి ప్రాంతీయ పార్టీకే ఉంటాయని నేత స్పందించారు. కాగా బిజెపి కూడా అన్ని సీట్లకు ఒంటరి పోరుకు సిద్ధం కావల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News