Saturday, November 2, 2024

అరుణాచల్ ప్రదేశ్ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

- Advertisement -
- Advertisement -

అరుణాచల్ ప్రదేశ్ లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 16 మంది కొత్తవారు కాగా, ముగ్గురు మంత్రులకు టికెట్లు నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి చేరిన ముగ్గురు ఎమ్‌ఎల్‌ఎలకు ఈ జాబితాలో చోటు లభించింది. ఈ జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులకు చోటు లభించగా వారిలో ఒకరికి ఎమ్‌ఎల్‌ఎగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. రాష్ట్ర హోం మంత్రి బమాంగ్ ఫెలిక్స్ (న్యాపిన్ స్థానం) , పరిశ్రమల మంత్రి టుమ్‌కే బగ్రా( ఆలో వెస్ట్), వ్యవసాయ మంత్రి టాగే టాకీ (జీరో హపోలీ) లకు ఈసారి పార్టీ టికెట్ లభించలేదు. కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు, తపీర్ గావో అరుణాచల్ వెస్ట్, అరుణాచల్ ఈస్ట్ నుంచి లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తారని గత వారం బీజేపీ ప్రకటించింది.

ఈ ఈశాన్య రాష్ట్రంలో లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. సిట్టింగ్ బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు లైసమ్ సిమాయి ( నామ్‌పాంగ్), కెంటో రీనా ( నారీ కొయు ), సెరింగ్ తాషి (తవాంగ్ ), లోకం తసార్ (కొలోరియంగ్ ) లకు పార్టీ టికెట్లు లభించలేదు. అలాగే మహిళా ఎమ్‌ఎల్‌ఎలు గమ్ తయేంగ్ (డామ్‌బక్ ) , జుముమ్ ఎటేడియోరి ( లేకాంగ్) లకు కూడా టికెట్ లభించలేదు. బీజేపీ నియమించిన నలుగురు మహిళా ఎమ్‌ఎల్‌ఎల్లో న్యాబి జిని డిర్చి ( బసార్) కొత్త అభ్యర్థి కాగా, మిగతా వారిలో సేరింగ్ హాము (లుమ్‌లా) , డసంగ్ల్ పుల్ (హాయులియాంగ్ ) , చకత్ అబోహ్ (ఖోన్సా వెస్ట్) పాతవారే. బీజేపీలో ఇటీవల చేరిన కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల్లో నినాంగ్ ఎరింగ్ (పసిఘాట్ వెస్ట్) , లోంబో టేయెంగ్ ( మెబో ), వాంగ్లింగ్ లోవాంగ్‌డంగ్ (బోర్డూరియా బోగపని) అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News