Friday, November 1, 2024

యుపిలో తారుమారైతే బిజెపి పతనమే

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం మధ్యలోనే కూలిపోయే అవకాశం
తొలి దశ ఎన్నికల్లో అఖిలేష్‌కు 40 సీట్లు, ఎన్నికల సర్వే నిపుణుడు ప్రశాంత్ కిషోర్ నన్ను కలిశారు
బిజెపి, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం పికె దేశవ్యాప్త సర్వే,  సన్నిహితుల వద్ద సిఎం కెసిఆర్ వ్యాఖ్యలు?

BJP defeat in UP Assembly elections

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై నే బిజెపి భవిష్యత్తు ఆధారపడి ఉందని, అక్కడ ఫలితాల్లో తారుమారైతే దేశ రాజకీయాల్లోనే పెనుమార్పులు జరిగే అవకాశముందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన బిజెపి, ప్రధాని మోడీపైనా గత మూడు రోజులుగా ఉవ్వె త్తున విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కెసిఆర్ తన సన్నిహితుల వద్ద దేశ రాజకీయాలపై పలు విషయాలు చర్చించినట్లు తెలిసిం ది. యుపి ఎన్నికల ఫలితాలపైనే బిజెపి భవిష్యత్తు ఆధార పడి ఉందని, ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే కేం ద్రంలో సాధారణ ఎన్నికల వరకు కొనసాగుతుందని, లేనిపక్షంలో కేంద్రంలో మధ్యలోనే కూలిపోయే అవకా శం లేకపోలేదని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించిన ట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే పార్టీలో నెలకొన్న అసంతృప్తులు ఒక్కసారిగా గుప్పుమనే అవకా శం ఉందని, అటువంటి వాతావరణం కూడా ఆ పార్టీలో చాలా స్పష్టంగా కన్పిస్తోందని చెప్పినట్టు వినికిడి. అదే కనక జరిగితే బిజెపికి మిత్రపక్షాలుగా ఉన్న అనేక పార్టీ లు ఎన్‌డిఎ కూటమి నుంచి బయటకు అవకాశా లను కూడా కాదనలేమని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోం ది. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తనతో సంప్రదింపులు కూడా జరిపారని, ఏదైనా ఎన్నికల ఫలితాలవరకూ వేచి చూసే ఉండాలని కేడర్‌కు ఆయన సూచించినట్టు తెలుస్తోంది.
కాగా, యుపి మొదటి విడత ఎన్నికల్లో స మాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలే ష్ యాదవ్‌కు 40 సీట్లు వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తనకొచ్చిన సమా చారమన్నారు. ఆ పార్టీకి 170 సీట్లు దాటితే పరిస్థితులు మరోలా ఉంటాయని, మొత్తానికి అఖిలేష్‌కు మంచి రో జులు రానున్నాయన్నట్టు కెసిఆర్ అన్నట్లు ఆయన సన్నిహితులంటున్నారు.

మనతో కలిసి పనిచేసేందుకు పికె సిద్ధం

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సర్వేల నిఫుణుడు ప్రశాంత్ కిషోర్ కూడా సర్వేలు చేస్తున్నాడని, ఆయన ఇటీవల తనను కలిసినట్టగా సన్నిహితులతో వ్యాఖ్యా నించినట్టు తెలిసింది. కాగా, ఆయన మనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాడని, అందుకు తాను కూడా అంగీకరించినట్లు కెసిఆర్ సూచనప్రాయంగా ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. బిజెపి, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం పికె దేశవ్యాప్తంగా కూడా సర్వేలు చేస్తున్నాడని అంటూనే, ఇది మనకు ప్రయోజ నకరంగా ఉండే అవకాశాలుంటాయని కెసిఆర్ భా విస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News