Sunday, January 19, 2025

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి పరాభవం తప్పదు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా తన స్వగ్రామం చింతమడకలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ కూటమిలో చేరబోమని కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోందని, ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర వహిస్తారని జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి పరాభవం తప్పదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News