Wednesday, January 15, 2025

మమత రాజీనామా చేయాలి.. బిజెపి డిమాండ్

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరుగుతున్న బరితెగింపు అవినీతికి అద్దం పడుతోందని బిజెపి ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనమా చేయాలని పశ్చిమ బెంగాల్ బిజెపి సహ ఇన్‌చార్జ్ అమిత్ మాలవీయ డిమాండు చేశారు. ఇది అది పెద్ద ప్రభుత్వ ప్రాయోజిత నియామక కుంభకోణమని ఆయన అభివర్ణించారు.

లక్షలాది యువత బతుకులు నాశనమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ కుభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి పార్థా చటర్జీ నుంచి రూ. 51 కోట్ల నగుదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఆయన తన జైలు పత్రాలలో తన మమతా బెనర్జీ పేరును ప్రస్తావించారని మాలవీయ ఆరోపించారు. కాగా..బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లామ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ కుంభకోణంలో మమతా బెనర్జీ ప్రధాన సూత్రధారని ఆరోపించారు. ఆమె వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News