Sunday, January 12, 2025

ఢిల్లీలో బిజెపి గెలిస్తే మురికివాడలను కూల్చివేస్తుంది

- Advertisement -
- Advertisement -

భూ సేకరణకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది
మురికివాడల వాసుల సంక్షేమం పట్టదు
ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఆరోపణ

న్యూఢిల్లీ : ఢిల్లీలో రానున్న శాసనసభ ఎన్నికల్లో బిజెపి గెలిచి అధికారంలోకి వచ్చినట్లయితే నగరంలోని అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ షాకూర్ బస్తీ ప్రాంతంలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, మురికి వాడల వాసుల సంక్షేమం కన్నా భూ సేకరణకే బిజెపి ప్రాధాన్యం ఇస్తోందని కూడా ఆరోపించారు. ‘వారికి ముందు మీ వోట్లు, ఎన్నికల అనంతరం మీ భూమి కావాలి’ అని కేజ్రీవాల్ బిజెపిని ప్రస్తావిస్తూ చెప్పారు.

బిజెపి చేపట్టిన ‘జహాఁ ఝగ్తి వహాఁ మకాన్’ (ఎక్కడ మురికివాడలు ఉంటే అక్కడ ఇళ్లు) అన్న పథకాన్ని కూడా ఆయన విమర్శిస్తూ, అది కంటితుడుపు అని అన్నారు. ‘గడచిన ఐదు సంవత్సరాల్లో వారు మురికివాడల వాసుల కోసం కేవలం 4700 ఫ్లాట్లు నిర్మించారు’ అని ఆయన చెప్పారు. మురికివాడల వాసుల అవసరాలను పరిగణించకుండానే ప్రస్తుతం వారి అధీనంలోని భూమిని స్వాధీనం చేసుకోవాలని బిజెపి యోచిస్తోందని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ వెంట షాకూర్ బస్తీ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి, పార్టీ సీనియర్ నేత సత్యేందర్ జైన్ ఉన్నారు.

జైన్ నాలుగవ సారి ఈ సీటును తిరిగి గెలుచుకోవాలని వాంఛిస్తున్నారు. ఆయన 2013, 2015, 2020 సంవత్సరాల్లో ఎన్నికల్లో గెలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఫలితాలను 8న ప్రకటిస్తారు. 2020 ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లలోకి 62 సీట్లను గెలుచుకున్న ఆప్ వరుసగా మూడవ విడత అధికారంపై కన్ను వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News