Thursday, January 23, 2025

బిజెపి జిల్లాల బాధ్యుల నియామకం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు భారతీయ జనతా పార్టీ జిల్లాల బాధ్యులను నియమించింది. శనివారం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా ఇన్‌ఛార్జీలుగా ఆదిలాబాద్ జిల్లాకు బద్దం లింగారెడ్డి, నిర్మల్‌కు ముల్కల మల్లారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్‌కు మైనా మహేష్ బాబు, నిజామాబాద్‌కు కల్లెం బాల్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు ఎర్రం మహేష్ , కరీంనగర్‌కు మీసాల చంద్రయ్య, జగిత్యాలకు చంద్రశేఖర్ (సంగారెడ్డి), పెద్దపల్లి జిల్లాకు రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు గంగడి మోహన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లాకు జె రంగారెడ్డి, మెదక్‌కు డాక్టర్ ఎస్.మల్లా రెడ్డి, రంగారెడ్డి రూరల్‌కు పి. అరుణ్ కుమార్, వికారాబాద్‌కు వేదవెల్లి రాజవర్ధన్ రెడ్డి, మేడ్చల్ అర్బన్‌కు గిరిమోహన్ శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ వేముల నరేందర్ రావు, నల్గొండ జిల్లాకు రావికంటి ప్రదీప్‌కుమార్, భువనగిరి యాదాద్రి జిల్లాకు జె. శ్రీకాంత్, మహబూబ్ నగర్‌కు కె.వి.ఎల్.ఎన్. రెడ్డి (రాజు), వనపర్తికి బోసుపల్లి ప్రతాప్, నాగర్ కర్నూల్ జిల్లాకు తూటుపల్లి రవికుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు వెంకట్ రెడ్డి, నారాయణపేట జిల్లాకు కడారి జంగయ్యయాదవ్, హన్మకొండకు అడ్లూరి శ్రీనివాస్, వరంగల్ జిల్లాకు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సన్నె ఉదయ్‌ప్రతాప్, జనగాం జిల్లాకు యాప సీతయ్య, మహబూబాబాద్‌కు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగుకు ఏర్పుల వెంకట రమణ, ఖమ్మం జిల్లాకు సరికొండ విద్యాసాగర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రంగరాజు రుక్మా రావు, గోల్కొండ -గోషామహల్‌కి సంద్రాసు నందకుమార్ యాదవ్, మహంకాళి- సికింద్రాబాద్ జిల్లాకు నాగురావ్ నామాజీ, న్యాయవాది, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు టి అంజన్‌కుమార్ గౌడ్‌ను జిల్లా బాధ్యుడిగా నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News