Monday, December 23, 2024

బిజెపికి గిరిజనులంటే గిట్టదు: కవిత

- Advertisement -
- Advertisement -

MP Maloth Kavitha gets 6 months Jail

 

హైదరాబాద్: బిజెపికి గిరిజనులంటే గిట్టదని, గిరిజనులంటే కళ్ళ మంట అని ఎంపి మాలోత్ కవిత విమర్శించారు. తెలంగాణ భవన్ నుంచి కవిత మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చావు కబురు చెబుతారా? అని మండిపడ్డారు. కిషన్ రెడ్డి తన ప్రకటనతో తాను ఓ చేత కాని దద్దమ్మ అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పట్ల బిజెపికి చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి ప్రకటనతో రుజువైందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బిజెపి భరతం పట్టే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయని, కేంద్ర మంత్రులు టూరిస్టుల్లా వచ్చి పోతున్నారు తప్ప తెలంగాణ కు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి కనీస సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉల్లంఘించారని, తెలంగాణకు కిషన్ రెడ్డి  ఉత్సవ విగ్రహంలా ఉన్నారని ఎద్దేవా చేశారు. గిరిజన యువత ఉద్యోగ అవకాశాలను బిజెపి దెబ్బ తీస్తోందని, తెలంగాణలో బిజెపికి రాజకీయంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేయడంలో లేదని ఎద్దేవా చేశారు.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News