Wednesday, April 16, 2025

ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదు:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమ పార్టీకి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ, గుజరాత్ వ్యాపారులతో కలసి బిఆర్‌ఎస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమ పార్టీకి లేదని అన్నారు. తెలంగాణకు సంబంధం లేని గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుతారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పాలించాలనే తాము కోరుకుంటున్నామని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి మిగిలేది శూన్య హస్తమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్న ఆయన ఆ పార్టీ ఓడిపోబోతోందనే విషయం సాధారణ ప్రజలకు కూడా తెలిసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News