అభివృద్ధి చేతకాక రాజకీయాలు కెసిఆర్ హయాంలో తెలంగాణ
ఎంతో పురోగతి మంత్రి కెటి
గ్యాస్, పెట్రో ధరల పెంపు నుంచి దృష్టి
మళ్లించడానికే తెరపైకి మతం,కులం
ప్రజలు ఏం తినాలో.. ఏ బట్టలు
కట్టుకోవాలో నిర్దేశిస్తున్నారు
ఎన్నో ప్రతిబంధకాలు అధిగమించి
నియామకాలు చేపడుతున్నాం
రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు
అంబేద్కర్ విశ్వవిద్యాలయం
రూపొందించిన పోటీ పరీక్షల
మెటీరియల్ ఆవిష్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమై, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు విమర్శించారు. మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. 8 ఏళ్ల పాలనలో ఏం సాధించారని విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌లను శనివారం మంత్రులు కె.టి రామారావు, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అందులో తెలంగాణా ఉద్యమం, రాష్ట్ర అవతరణ, ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి, భారత సమాజం – రాజ్యాంగం పరిపాలన, భారతదేశ చరిత్ర – సంస్కృతి అనే పుస్తకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల భారం మోపి పక్కదారి పట్టించేందుకు కులం, మతాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తిండి కోసం ఎంతో మంది అల్లాడుతున్నారని.. అలాంటి వారి గురించి ఆలోచించడం మానేసి అనవసర విషయాలపై ఎందుకు దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు.
సిఎం కెసిఆర్ హయాంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగినన్ని ని యామకాలు ఎక్కడా జరగలేదని తెలిపారు. ఎన్నో ప్రతిబంధకాలు అధిగమించి నియామకాలు చేపడుతున్నామన్నారు. 8 ఏళ్లలో 2.22 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉ ద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రైవేటు రంగ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.
ఐఎఎస్‌లకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాం
నీటి పారుదల రంగంలో తెలంగాణ ఉజ్వల స్థితికి చేరిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. జల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందని చెప్పారు. సిరిసిల్ల జిల్లా ఐఏఎస్‌లకే జల సంరక్షణ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందని కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తె లంగాణకు ఒక్క విద్యాసంస్థ కూడా కేటాయించని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది ప్రస్తుత మోదీ ప్రభుత్వమేనని కెటిఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వచ్చి కొందరు తమపై విమర్శలు చేస్తుంటారని, ముందు వాళ్లు ఏమేమి ఇచ్చారో తెలుసుకుంటే బాగుంటుందని అన్నా రు. ఎనిమిదేళ్లలో జరిగిన అభివృద్ధి అందరికీ తెలుసని, ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్లలో ఏం చేశారు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. రూ.400 ఉన్న సిలిండర్ రూ.వెయ్యికి ఎందుకు అయ్యింది అంటే మాత్రం నోరు ఎత్తరని ఎద్దేవా చేశారు. బడా బాబులకు 12 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్‌ని మాఫీ చేయొచ్చు కానీ పేదలకు 2, 3 లక్షల కోట్లు పెట్టి పెన్షన్లు ఇవ్వొద్దా..? అని ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధిని మరిచి వాళ్ళు ఏం బట్టలు కట్టుకోవాలి, ఏం తినాలి, ఏ దేవుడికి మొక్కాలి అనేది మాట్లాడే వాళ్ళు ప్రజల బాగోగులను విస్మరించారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తక్కువ ధరకే పుస్తకాలు
తెలంగాణా ప్రాంత నిరుద్యోగులకు ఉపయోగపడేలా త క్కువ ధరకే పోటీ పరీక్షల పుస్తకాలను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులోకి తేవడం మంచి ప్రయత్నం అని మంత్రి కెటిఆర్ కొనియాడారు. ఈ అవకాశాన్ని ఉద్యోగార్ధులు ఉపయోగించుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు. అవకాశం ఉంటే పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్లోకి అందుబాటులోకి తేవాలని, దానికి అవసరం అయ్యే ఆర్ధిక, సాంకేతిక పరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
విద్యారంగంలో మార్పులు : మంత్రి సబిత
విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలని సిఎం కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కెసిఆర్ నిర్ణయించారని చెప్పారు. ఉద్యోగార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎల్‌ఎ ఒక కోచింగ్ సెం టర్‌ను ప్రారంభించాలని, కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి కే ప్రారంభమయ్యాయని తెలిపారు. స్టడీ మెటీరియల్‌ను అన్ని కోచింగ్ సెంటర్లకు అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అన్ని గ్రంథాలయాలకు కూడా మెటీరియ ల్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, దానికి అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు.
గతంలో ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చారని, ఇప్పుడు విద్యా శాఖామంత్రి హోదాలో తాను ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.సీతారామ రావు మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయ మెటీరియల్ చదివి లక్షాలా ది మంది విద్యార్ధులు ఉద్యోగాలు సాధించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత విద్యార్ధులకు సహాయకారిగా నిలవాలని ప్రత్యేకంగా ఈ నాలుగు పుస్తకాలను రూపొందించామని వివరించారు.
బహిరంగ మార్కెట్‌లో అయిదు వేల రూపాయలకు అమ్మాల్సిన ఈ మెటీరియల్‌ను కేవలం ప్రింటింగ్ ఖర్చుకు (రూ.1100/-) లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు. టిఎస్‌పిఎస్‌సి మాజీ చైర్మన్, మెటీరియల్ రూపకల్పన కమిటీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తక్కువ సమయంలో రాష్ట్రంలో జరిగినన్ని నియామకాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదని అన్నారు. ప్రస్తుత పోటీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో విద్యార్ధులకు ఉపయోగపడేలా ఈ ప్రత్యేక పుస్తకాలను రూపొందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమలో ఎంఎల్‌సి వాణీ దేవి, తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రిజిస్ట్రార్ ఎ.వి. ఎన్.రెడ్డి తదితరులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య ఛైర్మన్ కె.సుధీర్ రెడ్డి తమ సంస్థ తరపున రూ. 11 లక్షల విలువైన పుస్తకాల కొనుగోలుకు ముందుకు వచ్చి ఆ చెక్కును విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఏ.వి.ఎన్.రెడ్డికి అందజేశారు. ఈ పుస్తకాలను తెలంగాణ ప్రభుత్వ గ్రంథాలయాల్లో విద్యార్ధులకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. కా ర్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, టి-శాట్ సి.ఇ.ఒ ఆర్. శైలేష్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి డి.రవీందర్, విద్యార్థి సేవల విభాగం డీన్ బానోత్ లాల్, దిడ్డి శ్రీనివాస్, ఆర్.జె.యు.కె.టి(బాస ర) ఇంచార్జ్ విసి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.