Wednesday, January 22, 2025

ఎమ్మెల్యేల కొనుగోలుకు నిరసనగా బిజెపి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి చేసిన కుట్రకు నిరసనగా టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బిజెపి దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి పెద్దలు నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను కొనలేరని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్‌నాథ్, మాజీ జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీ, టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ ప్రధానకార్యదర్శి గజ్జి మల్లేష్, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, వనం స్వామి, దబ్బెటి విజయరమేష్, కూరెళ్ల కుమారస్వామి, గనగాని నర్సింహ, టిఆర్‌ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు మల్లం అనిత, నాయకులు బయ్యని పిచ్చయ్య, సామ పద్మారెడ్డి, చెడిపెల్లి రఘుపతి, మొగుళ్ల అనురాధ, దబ్బెటి శైలజ, కట్ట ఇంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News