Friday, April 4, 2025

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఫక్కా మతపరమైన ఎజెండా: కేరళ సిఎం

- Advertisement -
- Advertisement -

త్రిస్సూర్ (కేరళ) :కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఫక్కా మతపరమైన ఎజెండా అని, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం ధ్వజమెత్తారు. కాషాయం పార్టీ పదేళ్ల పురోగతి గురించి ప్రాగ్రెస్ రిపోర్టు ఇచ్చే ధైర్యం, ఎన్నికల్లో ప్రజల ముందు నిలిచే ధైర్యం లేదని తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ లక్షం సంఘ్ పరివార్ శక్తులను ఓడించడమే కాకుండా, దేశ సార్వభౌమత్వం, సమతావాదం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం కాపాడడమే నని పేర్కొన్నారు. ఊపిరి సలపని ప్రచారంలో విజయన్ విలేఖరులతో మాట్లాడారు.

మతపర శక్తుల హస్తాల నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పించడం, ప్రజాస్వామ్య కేంద్రీకృత పాలనలోకి దేశాన్ని నడిపించడానికే ఈ ఎన్నికలని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు కలిగిన సంఘ్ పరివార్‌ను ఎదిరించే లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌ను గెలిపించాలా, లేదా బీజేపీ విధానాలకు అనుగుణంగా ఉంటున్న యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌ను గెలిపించాలా? అన్న ప్రశ్న ఓటర్ల ముందు ఉందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ సోమవారం కేరళలో ఎన్నికల ర్యాలీల్లో వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీపై విజయన్ తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News