న్యూఢిల్లీ: వచ్చే నెల 10వ తేదీ నుంచి ఏడు దశలలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను ఖరారు చేసేందుకు బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం నాడిక్కడ సమావేశమైంది. కరోనా వైరస్ సోకడంతో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యుపి సిఎం యోగి ఆదిత్య నాథ్, ఇతర నాయకులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 10న 58 స్థానాలకు, ఫిబ్రవరి 14న 55 స్థానాలకు యుపిలో పోలింగ్ జరగనున్నది. ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కింది స్థాయిలో ఏర్పడిన ప్రజావ్యతిరేకతను చల్లార్చడానికి చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను బిజెపి టికెట్లు ఇచ్చే అవకాశం కనపడడం లేదు. అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
యుపిలో అభ్యర్థుల ఖరారుపై బిజెపి కసరత్తు
- Advertisement -
- Advertisement -
- Advertisement -