Wednesday, December 25, 2024

రాజరాజ చోళుడిపై బిజెపి కట్టుకథలు

- Advertisement -
- Advertisement -

BJP fabrications on Rajaraja Cholu:vetrimaaran

మండిపడ్డ తమిళ దర్శకుడు వెట్రిమారన్ 

చెన్నై :రాజ రాజ చోళుడు హిందూరాజు కాదని, బిజెపి ద్రవిడ సంస్కృతిని , తమిళ గుర్తింపును దెబ్బతీసేలా రాజరాజ చోళుడిపై వక్రీకరణకు దిగిందని జాతీయ అవార్డు గ్రహీత అయిన తమిళ దర్శకులు వెట్రిమారన్ విమర్శించారు. ఈ దర్శకుడి వాదనను ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సమర్థించారు. బిజెపి ఇప్పటికే తిరువళ్లూరును కాషాయికరణం చేసేందుకు యత్నిస్తోందని, ఈ యత్నాలను మనం అనుమతించరాదని వెట్రిమారన్ పిలుపు నిచ్చారు. చోళుల కాలంలో ప్రత్యేకించి రాజరాజ చోళుడి హయాంలో హిందూ మతం లేదని, అప్పట్లో వైణవం, శైవం, సమానం ఆచార వ్యవహారాలు ఉన్నాయని ఓ సభలో వెట్రిమాన్‌తో కలిసి పాల్గొన్న కమల్‌హాసన్ తెలిపారు. బ్రిటిష్ వారు దేశ ప్రజలను సమిష్టిగా పిలిచేందుకు హిందూ అనే పదం నానుడిలోకి తీసుకువచ్చారని కమల్ తెలిపారు. రాజరాజ చోళ ఇతివృత్తం ఆధారంగా వెలువడ్డ కాల్పనిక నవలను తీసుకుని ప్రముఖ దర్శకులు మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ విడుదలైన తరువాత వెట్రిమాన్ స్పందించారు. ఈ దర్శకుడి వాదనను బిజెపి తీవ్రంగా ఖండించింది.

బిజెపి నేత హె రాజా స్పందిస్తూ రాజరాజ చోళ నిజమైన హిందూ రాజు అని, తాను వెట్రిమాన్ మాదిరిగా చరిత్ర బాగా తెలిసిన వాడిని కానని అయితే రాజరాజ చోళుడు మసీదులు, చర్చిలు నిర్మించారని ఆయన ఎలా చెపుతారని, నిజమైతే వాటిని చూపాలని సవాలు విసిరారు. రాజరాజు తనను తాను శివపాద శేఖరన్‌గా పేర్కొన్నారని, మరి ఆయన హిందువు కాదా? అని ప్రశ్నించారు. తమిళనాడులో రాజరాజ చోళుడుపై వివాదం నెలకొనడం ఇదే తొలిసారికాదు. 2019లో దర్శకులు పిఎ రంజిత్ ఈ రాజును విమర్శించారు. చోళుడి కాలం దళితులకు చీకటి యుగం అయిందని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. రాజరాజ చోళుడి కాలంలో దళితుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, అనేక విధాలుగా కులవివక్షతలు చోటుచేసుకున్నాయని రంజిత్ అప్పట్లో పేర్కొనడం దుమారానికి దారితీసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News