‘రాజనీతిజ్ఞు’డంటే ఎవరు? రాజకీయ వ్యాపారి అంటే ఎవరు? “నేటి, రేపటి తరాల భద్రత, ప్రగతి కోసం పరిశ్రమించేవాడు రాజనీతిజ్ఞుడు! కేవలం రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడేవాడు రాజకీయ వ్యాపారి! 2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో “వాతావరణం, మార్పులకు, కాలుష్యానికి గురి కాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడతాం! పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పని చేస్తాం! బొగ్గు వగైరా ఖనిజాల పొదుపు, భద్రతల మేనేజ్‌మెంటు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం!” అని రాసుకొన్నది బిజెపి!.
కాని గద్దెనెక్కిన దగ్గర నుండి, తమ ఎన్నికల ప్రణాళికను పాటించకపోగా, యుపిఎ ప్రభుత్వం రూపొందించిన పర్యావరణ పరిరక్షణ చట్టాలకు తూట్లు పొడవటం ప్రారంభించింది బిజెపి ప్రభుత్వం! గతంలో జనావాసాలు, సున్నిత పర్యావరణ ప్రాంతాలకు కనీసం 10 కి.మీ. దూరంగా కాలుష్య పరిశ్రమల్ని స్థాపించాలి అని వున్న చట్టాన్ని 5 కి.మీ. ఎడంగా స్థాపించవచ్చని సవరించారు. 2. సంప్రదింపుల ద్వారా స్థానికుల ఆమోదాన్ని, అటవీ పర్యావరణ వగైరా శాఖల నుండి క్లియరెన్స్ సర్టిఫికెట్లను పొందాకే ఆయా ప్రాజెక్టులు నెలకొల్పాలి అని యుపిఎ తెచ్చిన ఇఐఎ 206 నోటిఫికేషన్‌ను కొవిడ్ లాక్‌డౌన్‌లో చర్చించకుండానే స్వేచ్ఛగా పరిశ్రమలు నెలకొల్పుకొనేలా సవరించింది. 3. గతంలో పర్యావరణ హానికర పరిశ్రమల నెన్నింటినో తిరస్కరించిన ఎన్‌జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ) స్వయం ప్రతిపత్తిని నీరుగార్చేలా 2017లో దాని చట్టాన్ని సవరించారు. 4. దేశ రక్షణ, భద్రత, వ్యూహాత్మక ప్రాజెక్టులకు కేంద్రమే క్లియరెన్స్ ఇచ్చే చట్టం తెచ్చి పర్యావరణ రక్షణలో రాష్ట్రాల హక్కుల్ని కూడా లాగేసుకొన్నారు. 5. హిందువుల, హిందూ ధర్మాల పరిరక్షకులమంటున్న మోడీ బిజెపి ప్రభుత్వం ‘వృక్ష రక్షతి రక్షితః” అన్న హైందవ ధర్మ విరుద్ధంగా’ అడవుల్ని నరికి, పీకి, తగలేసి, గిరిజనులను తరిమేసి, కార్పొరేట్లు కోరుకున్నంత అడవిని 150 రోజుల్లోగా ఇచ్చేయాలన్న’ చట్టాన్నీ తెచ్చారు!
ఒడిశాలో వేదాంత కంపెనీ వారి బాక్సైట్ తవ్వకాలను అడ్డుకొన్న వేలాది గిరిజనులకు నాయకత్వం వహించిన వారిని మావోయిస్టు ముద్రవేసి జైళ్లలో కుక్కారు. వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్న వేదాంత ‘కాపర్’ ఫ్యాక్టరీ మూసివేతకు ఉద్యమించిన తమిళనాడులోని తూత్తుకుడి గ్రామస్థుల్ని రోడ్డు మీదనే కాల్చేశారు. పర్యావరణ ఉద్యమకారిణి ‘దిశరవి’ని దేశద్రోహ నేరం మోపి అరెస్టు చేశారు! మధ్యప్రదేశ్ సాల్ట్ ఫారెస్టులో బొగ్గు తవ్వకాలనడ్డుకొన్న ప్రియాపిళ్ళెని విదేశాలకెళ్ళకుండా అడ్డకున్నారు. ఇలా పర్యావరణ చట్టాలకు తూట్లు పొడుస్తూ ఉద్యమాలను, ఉద్యమకారులను అణచివేస్తూ ప్రధాని మోడీ గత ఐదేళ్ళలో 409 చ.కి.మీ అటవీ భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టారు.
ప్రధానిగానే కాదు, ముఖ్యమంత్రిగా గుజరాత్‌లోనూ ఇలాగే చేశారు. తత్ఫలితంగానే మోడీ పాలనలో 2010లో ‘అత్యంత కలుషిత రాష్ట్రంగా, 2012లో మిక్కిలి కలుషిత నదుల్లో గుజరాత్‌లోని మూడు నదులను ప్రకటించింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. మోడీ హయాం 2018లో ప్రపంచ అత్యంత కలుషిత 20 నగరాలలో 15 భారత నగరాలేనని ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఇండెక్స్’ అంటే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సూచికలో 180దేశాల్లో భారత్‌కు 177వ స్థానం దక్కింది! అంతేకాదు, అటవీ భూముల్లో 30% చెట్లు అదృశ్యమైనట్లు 2020జనవరిలో అడవుల పరిస్థితిని తెలిపే నివేదిక వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోడీ చిత్తశుద్ధికి నిదర్శనాలు.
హరిత హారం : గీత 13 28 “విశ్వమంతటా ఈశ్వరుడు సమంగా నిల్చి వుండుటను చూడగలిగిన జ్ఞాని దేనిని హింసించినా ఈశ్వరున్ని హింసించినట్లని గ్రహించగలడు” ఉదా: ప్రాణి మనుగడుకు వివిధ అవయవాల రూపంలో దేహమంతటా నిలిచినట్లే జీవుల మనుగడ కోసం భూమి అంతటా సముద్రాలు, కొండలు, అడవులు, నదులు, చెరువులు, పొలాలు, నివాసాల రూపంలో నిలిచియున్నాడు ఈశ్వరుడు! దీన్నే ప్రకృతి సమతూకమన్నారు శాస్త్రజ్ఞులు! ఈ సమ తూకాన్ని కాపాడుకుంటుండాలన్న గీత ప్రబోధాన్ని పాటిస్తున్న నేతలలో ప్రథముడు కెసిఆర్!ఉదా: 33.3 % వుండాల్సిన అడవులు, విచక్షణా రహితంగా నరికినందున తెలంగాణలో 19%కి పతనమైనట్లు సర్వేల ద్వారా గుర్తించారు కెసిఆర్ !అడవులు తరిగితే ఆ మేరకు వర్షాభావం, వాయు కాలుష్యం, భూతాపం, భూకంపాలు మొ॥ ప్రమాదాల బారిన పడతారు ప్రజలని గ్రహించిన కెసిఆర్ ‘వృక్ష రక్షతి రక్షితః!” అంటూ ప్రజలను, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులను ప్రోత్సహిస్తూ ఇళ్ళ ముందు, చేల గట్లు మీద, రోడ్ల పక్కన, కార్యాలయాల చుట్టూ, ఖాళీ ప్రదేశాలలో ఏడేళ్ళలో 4.5 కోట్ల మొక్కల్ని నాటించారు. వాటికి వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయించి, కంచె వేయించి వృక్షాలుగా ఎక్కదీశారు! అడవుల్లోనూ ఖాళీలున్న చోటల్లా పండ్ల చెట్లను నాటించారు. అవి కాపు రాగానే గ్రామాలలోని కోతులన్నీ అడవి బాట పట్టినయ్. ఆ పండ్ల చెట్లే నేడు ‘మంకీ ఫుడ్ కోర్టులుగా’ మారినయ్.
అడవుల రక్షణార్థం వాటి చుట్టూ కందకాలు తీయించి, బయటి పశువులు అడవుల్ని మేయకుండా చేశారు. కందకాలలోని నీళ్ళు అడవి జంతువులకు త్రాగునీరైంది! ఈ ‘హరిత హారాన్ని’ నిరంతర ప్రక్రియగా రూపొందించే సంకల్పంతో గ్రామ గ్రామాన నర్సరీలను పెంపొదింప చేస్తున్నారు. ఇలా బహుముఖ పరిశ్రమ ద్వారా లోపించిన అడవులనిలానింపుతూ, పుష్కల వర్షాలు, పాడి పంటల నిలయంగా రూపొందించి తెలంగాణ ప్రజల, ప్రాణుల భద్రతకు దృఢమైన పునాది వేశారు కెసిఆర్! “ఓట్లు రాల్చని చెట్లు ఎన్ని నాటితే ఏం లాభం?” అన్నట్టు చూస్తున్న ప్రజాప్రతినిధులతో “హరిత హారానికి ఓట్లు రాలవ్, కాని వర్షాలు మాత్రం ఖచ్చితంగా కురుస్తయ్! మీకు హామీ ఇస్తున్నా అంటూ ప్రోత్సహించారు కెసిఆర్! ఇంకుడు గుంటలు: గీత 77 “దారమందలి మణుల్లా, విశ్వమంతా నాయందు గుచ్చబడి వున్నది.
అంటే విశ్వంలోని ప్రతిదీ ఇంకొక దానిపై ఆధారపడి (ఇచ్చిపుచ్చుకొంటూ) జీవిస్తున్నయ్! ఉదా॥ అడవులు (చెట్లు) మబ్బులను చల్లబరుస్తుంటయ్! మబ్బులు వర్షం ద్వారా చెట్లకు నీటిని అందిస్తుంటయ్. 2. కర్బన తీసుకుంటూ ప్రాణులకు ప్రాణ వాయువు నిస్తుంటయ్ చెట్లు, ప్రాణ వాయువు తీసుకొని చెట్లకు కర్బన వాయువు నిస్తుంటయ్ ప్రాణులు. 3. మేఘాలకు నీటి ఆవిరి నందిస్తుంటయ్ సముద్రాలు, మేఘాలు వర్షం రూపంలో నీటి నందిస్తుంటయ్! 4 తన గర్భంలోని నీటిని చెట్లకు, (బోర్లు ద్వారా) మనుషులకూ అందిస్తున్నది భూమి. నదులు, చెరువులు, గుంటల ద్వారా నాటిని తాగుతుంటుంది. భూమి! ఇలా ప్రతిదీ తనకున్న దానిని ఇస్తూ లేని దాన్ని పుచ్చుకుంటూ జీవించడం సృష్టి ధర్మం.
ఈ ధర్మాన్ని విస్మరిస్తే అన్న, పానీయాలు తీసుకొని, మల మూత్రాలను వదలని మన దేహం లాగే జబ్బునపడి నశిస్తుంది సృష్టి! అంటూ గీత ప్రబోధాన్ని వివరించాడు శ్రీరామకృష్ణ పరమహంస! ఈ సృష్టి రహస్యాన్ని గ్రహించిన నేత కెసిఆర్. అందుకే నిరంతరం భూమి నుండి నీటిని తోడుకుంటున్న మనపై తిరిగి భూమికి నీరందించాల్సిన బాధ్యత కూడా వుందని, మన ఇళ్ళ దగ్గర, వీధుల పక్కన ఇంకుడు గుంటలు నిర్మించి, చెరువులను పునరుద్ధరించి, తద్వారా భూగర్భ జలాలను పెంపొందించే ప్రణాళికలను కూడా రూపొందించారు కెసిఆర్. తత్ఫలితంగానే పుష్కల వర్షాలతో, పాడి పంటల సమృద్ధితో భారత దేశానికి మరో ధాన్యారంగా, దేశానికి అత్యధికంగా ఆదాయాన్నందిస్తున్న నాల్గవ రాష్ట్రంగా వర్ధిల్లుతున్నది తెలంగాణ! అంతేగాదు తాతయ్యా! తన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు విశ్వనగరంగా ఖ్యాతిని, క్లీన్ గ్రీన్ సిటీ జాతీయ అవార్డును కూడా సంపాదించుకున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ కాని. నాడు ముఖ్యమంత్రిగా మిక్కిలి కలుషిత మూడు నదులున్న రాష్ట్రంగాను మిక్కిలి కలుషిత రాష్ట్రంగానూ! తన గుజరాత్‌కు, నేడు ప్రధానిగా కాలుష్య రహిత దేశాలలో తన భారత దేశానికి 177వ ర్యాంకును! మిక్కిలి కాలుష్యపూరిత 20 ప్రపంచ నగరాలలో 15 నగరాలున్న దేశంగా తన దేశానికి అత్యంత కాలుష్య నగరంగా తన దేశ రాజధాని ఢిల్లీకి బోలెడంత అపఖ్యాతిని తెచ్చిపెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ!
పాతూరి వేంకటేశ్వరరావు, 9849081889