Monday, December 23, 2024

బిజెపి కూటమికి ‘ఇండియా’ అని పేరు చూడగానే వణుకు పుడుతుంది : సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇండియా కూటమి పేరు వినగానే కేంద్రంలోని బిజెపికి వణుకు పుట్టిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్చారని, అంత అవసరం ఏమొచ్చిందని, ఎప్పటి నుండో ఇండియా అని చెప్పుకుం టున్నామని, ఎందుకు అర్జెంట్‌గా ఇండియాను ‘భారత్’ అని మార్చాల్సిన అవసరం ఏముందని? కేంద్రంలోని బిజెపిని నిలదీశారు. ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా బిజెపికి ఒళ్లు జలదరించిందని, అందుకే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నారని, ఇండియా అనే మాటను కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇండియాను ‘భారత్’గా పేరుమార్చేందుకు రాజ్యాంగ సవరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇండియాను చూసి,  ప్రత్యేక సమావేశాన్ని చూసి బిజెపి భయపడుతుందంటేనే ఆ పార్టీ ఓడిపోయిందని, ఇక ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని తెలిపారు. బిజెపి ఎన్ని ఎన్నికల జిమ్మిక్కులకు పాల్పడినా ‘ఇండియా కూటమి’ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

జి20 సమావేశాల గుర్తును కూడా పుష్పం గుర్తు పెట్టారని నారాయణ మండిపడ్డారు. బిజెపి సంస్కృతి, బిగ్ బాస్ సంస్కృ తి ఒకటేనా అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ప్రశ్నించారు. బిగ్‌బాస్ అసాంఘీక చర్యల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటున్నారని, ఇది చెడుమార్గాలకు దారితీస్తుందని , తద్వారా యువతకు ఆదర్శవంతమైన దారి కనిపించబోదన్నారు. బిగ్ బాస్ కేసు అంశంలో అలహాబాద్ కోర్ట్ తీర్పు ఆధారంగా ఎవ్వరూ బిగ్ బాస్ పైన కేసు నమోదు చేయడం లేదని వివరించారు. బిగ్‌బాస్ కేసు సుప్రీంకోర్ట్ సుమోటోగా కేసు నమోదు చేసి, బిగ్ బాస్‌ను నిషేధించి, సమాజాన్ని , యువకులను కాపాడాలని, నైతిక విలువలను పెంచాలని సుప్రీం కోర్ట్‌ను నారాయణ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News