Thursday, January 23, 2025

మధ్యప్రదేశ్ బిజెపి మూడో జాబితా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో బిజెపి అభ్యర్థుల జాబితా వెలువడింది. ఇందులో ముగ్గురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గాన్ సింగ్ కులాస్తేలకు టిక్కెట్లు కల్పించారు. ప్రధాని మోడీ భోపాల్‌లో బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించి వెళ్లిన తరువాత ఈ జాబితా వెలువడింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ దిమానీ నుంచి, ఫుడ్ ప్రాసిసింగ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ నార్సింగ్‌పూర్ నుంచి, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్ నివాస్ స్థానం నుంచి బరిలోకి దిగుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది బిజెపి ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News