- Advertisement -
హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బిఆర్ఎస్ జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఎందుకు పోటీచేయడం లేదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతూ బిజెపిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కేసీఆర్‌కు ఉందా? అని కిషన్ రెడ్డి అడిగారు. తాము రజాకార్ల వారసులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -