Wednesday, January 22, 2025

డిఎంకె అవినీతిపై పోరాటం: తమిళనాడు బిజెపి అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: తమిళనాడులో అధికార డిఎంకె ప్రభుత్వ అవినీతికి సంబంధించిన మొదటి భాగం ఫైళ్లను ఈ రోజు విడుదల చేశామని, ఏడాది పొడవునా వరుసగా డిఎంకె ప్రభుత్వ అవినీతికి సంబంధించిన వివరాలు బయటపెడతూనే ఉంటామని తమిళనాడు బిజెపి అధ్యక్షుడుకె అణ్ణామలై ప్రకటించారు. శనివారం చెన్నైలో ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ డిఎంకె నాయకులకు ఒక కంపెనీలో ఉన్న ప్రత్యక్ష ఆస్తుల వివరాలు బయటపెట్టామని చెప్పారు.

కేవలం డిఎంకె కుంభకోణాలనే కాక ఇతర పార్టీల అవినీతి చిట్టాలను కూడా బయటపెడతామని ఆయన చెప్పారు. తమిళనాడు ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతామని, వారు ఎవరికి ఓటు వేస్తారో చూద్దామని అణ్ణామలై చెప్పారు. తాము పోరాడుతోంది ఒక పార్టీతో కాదని, అవినీతిపైనే అని ఆయన స్పష్టం చేశారు. డిఎంకె కుంభకోణాలను బట్టబయలు చేసేందుకు తమ పార్టీ ఒక యాత్రను చేపట్టబోతున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి బిజెపి కార్యకర్త ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ యాత్రలో బిజెపి కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News