Monday, December 23, 2024

సోనియాపై ఎన్నికల కమిషన్‌కు బిజెపి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కర్ణాటక సార్వభౌమత్వం అని పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశం అయింది. హుబలి సభలో సోనియా మాట్లాడుతూ కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ చూస్తుందని, అందుకు భంగం కలిగించే వారిని ఎవరినీ అనుమతించబోదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది. సార్వభౌమత్వం అన్న పదం దేశం కోసం వినియోగిస్తామని అందుకే సోనియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని , సోనియాపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.

హుబలీ సభలో సోనియా మాట్లాడిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా సోనియా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆగ్రహం వెలిబుచ్చారు. ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సోనియా వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News