Wednesday, January 22, 2025

14 మందితో బిజెపి తుది జాబితా

- Advertisement -
- Advertisement -
మూడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బిజెపి చివరి జాబితా విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 14 స్థానాలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా మూడు స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పు చేర్పులు చేసి చివరకు 14 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. వనపర్తి, చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి అభ్యర్థులను మారుస్తూ చివరి జాబితాను ప్రకటించింది. వనపర్తిలో అశ్వద్ధామరెడ్డికి స్థానంలో అనుఘ్నారెడ్డికి టికెట్ ఇచ్చింది. బెల్లంపల్లిలో శ్రీదేవి బదులు కొయ్యాల ఏమాజీకి టికెట్ కేటాయించింది. బెల్లంపల్లి స్థానానికి ఒక రోజు ముందే అభ్యర్ధిగా శ్రీదేవి నామినేషన్ వేశారు. అలాగే చాంద్రాయణగుట్ట అభ్యర్థి సత్యనారాయణ ముదిరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంతో చాంద్రాయణగుట్టలో సత్యనారాయణకు బదులు మహేందర్‌కు టికెట్ కేటాయిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

14మంది అభ్యర్థుల జాబితా……

బెల్లంపల్లి: కొయ్యాల ఎమాజీ
పెద్దపల్లి: దుగ్యాల ప్రదీప్ రావు
సంగారెడ్డి: రాజేశ్వరరావు
నర్సంపేట:  పుల్లారావు
దేవరకద్ర :  కొండా ప్రశాంత్ రెడ్డి
నాంపల్లి : రాహుల్ చంద్ర
కంటోన్మెంట్: గణేష్
శేరిలింగంపల్లి:  రవికుమార్ యాదవ్
మల్కాజ్ గిరి:  రామచంద్రరావు
మేడ్చల్: ఏనుగు సుదర్శనరెడ్డి
వనపర్తి:  అనుఘ్నారెడ్డి
చాంద్రాయణగుట్ట : మహేందర్
మధిర: విజయరాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News