- Advertisement -
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో బిజెపి అడుగులు వేస్తోంది.తెలంగాణలో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది కమలం పార్టీ. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బిజెపి అధిష్టానం.. 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖారారు చేసింది. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్ ఇచ్చింది.
సికింద్రాబాద్ నుంచి కేంద్రంమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేయనుండగా.. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అర్వింద్ పోటీ చేయనున్నారు. మిగతా ముగ్గురిలో చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి బూర నర్సయ్య గౌడ్ లు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది బిజెపి.
- Advertisement -