Monday, December 23, 2024

ఫిబ్రవరి మొదటి వారంలో బిజెపి ఫస్ట్ లిస్టు

- Advertisement -
- Advertisement -

బలహీన నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన
8 స్ధానాల్లో ముందుస్తుగా రేసు గుర్రాలు ఖరారు
చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఫార్ములా ప్రయోగం
ఈసారి ఎన్నికల్లో డబుల్ డిజిట్ దిశగా కమలనాథులు ప్లాన్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచే విధంగా కమలనాథులు వ్యుహాలకు పదును పెడతున్నారు. అందుకోసం బలహీనంగా ఉన్న పలు స్దానాల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు బిజెపి అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో పార్టీ బలం పుంజుకున్న దక్షిణ తెలంగాణలో ఆశించిన స్ధాయిలో ఓట్లు రాబట్టలేక పోయింది. ఈజిల్లాలోని పార్లమెంటు స్ధానాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్‌లో జరిగిన చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని చోట్ల ముందస్తుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించి విజయం సాధించింది. అదే ఫార్ములాను తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఫార్ములా ప్రకారం బిజెపి బాగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి, ముందుగా వాటికి అభ్యర్ధులను ప్రకటించనున్నారు. ఈవిధానం ద్వారా ఎన్నికల సమయానికి అక్కడ పార్టీ బలపడే అవకాశం ఉంటుందని భావిస్తు న్నారు. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ఇదే ఫార్ములా పార్లమెంట్ ఎన్నికల్లోనూ కలిసి వస్తుందని, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టేందుకు అవకాశం కలిసి వస్తుందని పార్టీ సీనియర్లు నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 545 పార్లమెంటు స్ధానాల్లో 175 చోట్ల బిజెపి చాలా బలహీనంగా ఉన్నట్లు పార్టీ హైకమాండ్ పలుమార్లు నిర్వహించిన సర్వేలో గుర్తించిం ది. ఈ సీట్లలో పోటీలో నిలపాల్సిన అభ్యర్థులపై ఎంపిక కూడా మొదలు పెట్టింది. ఇటీవలే రాష్ట్ర బిజెపి నాయకులు లోక్‌సభ స్థానాలకు ఇంచార్జీలను నియమించింది. వారంతా పార్టీ బలోపేతంపై దృష్టి సారించి మండల, మున్సిపాలటీ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ బలమైన అభ్యర్ధి కోసం అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వారి రిపోర్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఫిబ్రవరి మొదటి వారంలో ఫస్ట్ లిస్టు విడుదల కావచ్చని పాలమూరుకు చెందిన మాజీ ఎంపి తెలిపారు. ముందస్తు ఫార్ములాలో భాగంగా మొదటి జాబితాలో తెలంగాణలోని 8 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆశావాహులు చెబుతున్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్ధానాలకు దక్షిణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. సిట్టింగ్ స్ధానాలైన సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో కూడా గతం కంటే మెజార్టీ ఎక్కువ వచ్చే విధంగా చేస్తున్నట్లు, మరో నాలుగు నియోజకవర్గాలైనా మల్కాజిగిరి,చేవెళ్ల, మెదక్, జహీరాబాద్‌లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించవచ్చని ధీమాలో బిజెపి హైకమాండ్ ఉంది. హైదరాబాద్ పార్లమెంటు విషయంలో అభ్యర్థి ప్రకటనపై తర్జనభర్జన పడుతున్నారు. ఎప్పుడు ప్రకటించిన గతంలో వచ్చిన ఫలితం వస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.
డబుల్ డిజిట్ కోసం బిజెపి ప్లాన్:
త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లులో విజయం సాధించాలని బిజెపి టార్గెట్ పెట్టుకుంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంగరకలాన్ నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్లు విబేదాలు వీడి ఐక్యంగా పని చేయాలని సూచించారు. అసెంబ్లీ పోరులో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో ఆశించిన సీట్లు రాలేదని లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర నేతలు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతంపై వ్యుహాలు రచిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News