Friday, December 20, 2024

తొలి పొద్దులోనే బిజెపిలో అసంతృప్తి అలకలు

- Advertisement -
- Advertisement -

ప్రధానపార్టీ, పది సంవత్సరాలు అధికారంలో తిరుగులేకుండా ఉన్న బిజెపిలో ఎన్నికల వేళ తొలి అభ్యర్థుల జాబితాతోనే తీవ్రస్థాయిలోనే అసంతృప్తి వెలువడింది. ఆశించిన చోట్ల సీట్లు రాలేదని కొందరు ప్రముఖులు ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. మరికొందరు ప్రముఖులు , ప్రత్యేకించి తొలి జాబితాలోనే పేరు ఎందుకు లేదని మరికొందరు నేతలు తాము రాజకీయాలకు సరిపోమని భావిస్తున్నామని పేర్కొంటూ, ఇక తాము తిరిగి తమతమ పూర్వాశ్రమాలకు మునుపటి విధులకు వెళ్లుతామని ప్రకటించారు. కేవలం అసంతృప్తినే వ్యక్తం చేసుకుంటూ, అసమ్మతిని భారీ స్థాయిలో బాహాటంగా ఈ పరోక్ష నిరసన వ్యక్తం కావడం పార్టీలో అంతర్గత అంతర్మథన పరిణామానికి దారితీసింది. అమిత్ షా ఎక్కువగా ప్రధాన పాత్ర పోషించి వెలువడ్డ తొలి జాబితాలో వెలుగులోకి రాని పలువురు ప్రముఖుల పేర్లు పార్టీలో కొన్ని శ్రేణులలో విస్మయానికి దారితీశాయి.

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఆదివారం తన అలకను పరోక్షంగా వ్యక్తపర్చారు. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని, ఇక డాక్టర్ వృత్తికి తిరిగివెళ్లుతున్నానని ప్రకటించారు. తొలి లిస్టులో ఆయన పేరు లేకుండా పోయింది. ఈసారి అమిత్ షా అత్యంత వ్యూహాత్మకంగా అభ్యర్థుల జాబితా రూపకల్పనలో చేపట్టిన చర్యలతో పార్టీ వర్గాలలో కొంత మేరకు ఇప్పటివరకూ ఉన్న అసంతృప్తి రాబోయే రోజులలో అసమ్మతికి దారితీస్తుందని పలు పరిణామాలతో వెల్లడైంది. అయితే ఇప్పుడు తమకు పూర్తి స్థాయి జాతీయ సానుకూలత ఉన్నందున పార్టీలో ఏ స్థాయిలో కూడా ఎదురనేదిలేకుండా చూసుకునేందుకు మోడీ, అమిత్ షాలు చేసిన వ్యూహరచన బిజెపి సారధి నడ్డా ద్వారా ఇప్పుడు అమలు చేస్తున్నట్లు, ఈ దశలో కీలక నేతలు ప్రచార దశల్లో సైలెంట్ కావడం లేదా, పోటీకి దిగకుండా విరమించుకోవడం వంటి చర్యలకు దిగుతారని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News