Tuesday, January 21, 2025

రాష్ట్రంపై బిజెపి గురి..! ఈ నెలలో ముగ్గురు అగ్రనేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలే లక్షంగా బిజెపి అగ్రనాయకత్వం దృష్టి సారించింది. బిఆర్‌ఎస్‌ను గద్దె దించి అధికారం చేపట్టే దిశగా కార్యాచరణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షా, జెపి నడ్డాతో మూడు బహిరంగ సభలు ఏర్పాటుకు రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అమిత్ షా, జెపి నడ్డా షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం రానున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. జూన్ 25న నాగర్ కర్నూలు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్నారు.

ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్‌ఎస్ అరాచక పాలన గురించి వివరించాలని చూస్తోంది. వీరు మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా నిర్వహించే సభలో పాల్గొని తొమ్మిదేళ్లలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రం ఎలా దారి మళ్లించిందో విడమర్చి చెప్పే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగమైన నాగర్ కర్నూల్ సభలో జెపి నడ్డా పాల్గొననుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఇరువురు ముఖ్యనేతల పర్యటనలు ఖరారు కావడంతో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు, ఆఫీసు బేరర్లు, సోషల్ మీడియా టీంలతో మంగళవారం సమావేశమయ్యారు. అగ్రనేతల పర్యటనలు విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News