Monday, December 23, 2024

ప్రతిపక్షాన్నిచీల్చడానికి రాహుల్‌ గాంధీపై బిజెపి గురి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అధికార బిజెపి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పూర్తి గురిపెట్టింది. ముఖ్యంగా ప్రతిపక్షాన్ని చీల్చడానికి ఆయనను లక్ష్యంగా చేసుకుంటోంది.  విదేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తూర్పారపడుతోంది. ఆయన ఇటీవల ఇంగ్లాండ్‌లో భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉందని, పార్లమెంటులో ప్రతిపక్షాలకు అసలు విలువే ఇవ్వడంలేదని అన్నారు. ఇదిలావుండగా బిజెపి ఎంపి నిశికాంత్ దుబే లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యాలు బిజెపికి ఆక్షేపణీయమైతే, మరి ప్రధాని నరేంద్ర మోడీ చైనా, డెన్మార్క్ , కెనడాలలో పూర్వపు ప్రభుత్వాల తీరుతెన్నులను తూర్పారపడుతూ చేసిన అవాకులుచెవాకుల సంగతి గురించి బిజెపి నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.

తదుపరి లోక్‌సభ ఎన్నికలకు కేవలం 14 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు 2024లో జరుగనున్నాయి. ఈసారి పోటీ ప్రధానంగా మోడీ, రాహుల్ గాంధీ మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీల పాత్ర కూడా కీలకంగా ఉండనున్నదని తెలుస్తోంది. అయితే బిజెపి మేనేజర్లు, వ్యూహకర్తలు ఇప్పుడు రాహుల్ గాంధీ ‘ఫాల్ట్ లైన్స్’పై దృష్టి పెట్టబోతున్నారు. ఎట్లాగైనా సరే రాహుల్ గాంధీని నివారించడానికి, దెబ్బతీయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News