Thursday, January 23, 2025

పల్లెపల్లెకు బిజెపి

- Advertisement -
- Advertisement -

కుభీర్ : పల్లెపల్లెకు బిజెపి గడపగడపకూ మోహన్‌రావు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బ్రహ్మేశ్వర తాండా, చోక్లానాయక్ తాండా, నందుపాడ్ తాండా, సేవాదాస్ నగర్, భూతాళి తండాలలో ఆయన పాల్గొని బిజెపి జెండాలను ఆవిష్కరించారు. ముందుగా బ్రహ్మేశ్వర్‌లోని అతి పురాతనమైన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివుని ఆశీర్వచనాలు అందుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడుతూ రైతుల కోసం తాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్లు కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని మరి రైతులకు వచ్చే సబ్సిడీలు ఎందుకు వస్తలేవని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకుసరిగ్గా జీతాలివ్వలేనోడు రైతులను ఎలా ఆదుకుంటాడు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతోందని అబద్దాలు చెబుతూ కేసిఆర్ రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు.

దళితబంధు పేరుతో దళితులను దగా చేస్తూ దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు అంటూ ఏవేవోకథలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దెవా చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. యూరియా బస్తా ధర 3750 ఉంటే కేంద్రం 90 శాతం సబ్సిడీతో రైతుకు కేవలం 300ల రూపాయలకే ఇస్తోందని అన్నారు. అలాగే డీఏపీ లు ధర రూ. 4073 లు ఉండగా రైతుకు1450 అందిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో దేశంలో ఎక్కడా సమస్య లేకపోయినా తెలంగాణలో మాత్రం లేనిపోని సమస్యలుసృష్టించి రైతులు ఇబ్బందులు పడుతుంటే రాక్షసానందం పొందుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News