Sunday, December 22, 2024

పసుపు బోర్డు పేరుతో కర్ణాటక ఎన్నికల్లో బిజెపి మోసం: మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

బిజెపి వల్ల దేశంలో వైషమ్యాలు తప్పా అభివృద్ధి లేదు
సిఎం కెసిఆర్ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు
బిజెపి విద్వేష, కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది
కెసిఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా…
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో బాండ్ రాసిచ్చిన బిజెపి నేడు అదే హామీతో కర్ణాటక ఎన్నికల్లో రైతులను మోసం చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన బిజెపి, బిఎస్పీ పార్టీకి చెందిన పలువురు యువకులు హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కానిది, కర్ణాటకలో ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. బిజెపి వల్ల దేశంలో వైషమ్యాలు తప్పా అభివృద్ధి లేదన్నారు. సిఎం కెసిఆర్ అభివృద్ధి కోసం పని చేస్తుంటే బిజెపి విద్వేష, కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ దార్శనికత వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా ఎదిగిందని మంత్రి వేముల గుర్తు చేశారు.

మంత్రి కెటిఆర్ వల్ల రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ వల్ల రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు వచ్చాయని, సుమారు 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించారన్నారు. కెటిఆర్ చొరవ వల్ల ఐటి ఎగుమతులు పెరిగాయని, నూతన ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక అయ్యిందని తెలిపారు. బిజెపిలో విలువలు దిగజారిపోయాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ, అన్ని రకాల ధరలు పెంచుతూ సామాన్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ అసమర్థ ప్రధాని అని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు, ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరు, బిజెపి అలంభిస్తున్న విధానాలపై గ్రామాల్లో ముఖ్యంగా యువతలో చర్చ జరగాలన్నారు. బిజెపి తీరుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన యువకులు రాజీనామాలు చేసి బిఆర్‌ఎస్‌లో చేరడం యువతలో వచ్చిన మార్పునకు నాంది అన్నారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన వారు..
బిజెపి, బిఎస్పీ పార్టీల నుంచి భారత రాష్ట్ర సమితిలో చేరిన వారిలో ఎద్దండి రంజిత్, ర్యాడ ప్రణయ్, బక్కయ్యగారి వినేశ్, బాసర భరత్, ఒరగంటి వినయ్, మోర్తాడ్ గణేష్, మర్రి వినోద్, పుప్పాల సత్యనారాయణ, గోల్కొండ శరత్, దాసరి నితిష్, బి.శ్రీనివాస్ గౌడ్, పందేన శంకర్, మర్రి చిన్నారెడ్డి, సిరుప అజయ్, దాసరి సాయికిరణ్, బోజపల్లి శ్రీకర్, బండి ఉదయ్, బాలిశెట్టి సాగర్, బక్కయ్యగారి నితిన్, గోల్కొండ మల్లేష్, జి.అక్షయ్,ర్యాడా రాకేష్, కె.విజ్ఞేష్, పి.సుశాంత్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డాక్టర్ మధుశేఖర్, వైస్ ఎంపిపి సురేష్, సర్పంచ్ లింబాద్రి, రాజశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ అశోక్, ఎస్సీ మండల ప్రెసిడెంట్ తలారి ప్రభాకర్, మోర్తాడ్ నర్సయ్య, యువ నాయకులు నిమిష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News